News Monday, December 22, 2025 - 10:26

Select District: 
News Items: 
Description: 
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్ యువత కోసం RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2025 దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ త్వరలో ముగియనుంది. కనుక అధికారిక సైట్‌ opportunities.rbi.org.inలో దరఖాస్తు చేసుకోండి. ఆర్బిఐ ఇంటర్న్‌షిప్ RBI Summer Internship 2025 | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) యువత కోసం ఈ సంవత్సరం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభం కాగా, ఇప్పుడు దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 15, 2025గా నిర్ణయించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక సంస్థలలో ఒకటైన RBIతో కలిసి పనిచేసే అనుభవం పొందాలనుకునే విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ గొప్ప అవకాశమని చెప్పవచ్చు. క్రింద పేర్కొన్న step by step దశల ద్వారా సులభంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టైపెండ్ ఎంత లభిస్తుంది? ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఇంటర్న్‌షిప్ పూర్తిగా చెల్లింపు (RBI Paid Internship)తో కూడుకున్న ప్రక్రియ. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైపెండ్ లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జూలై 2026 వరకు మూడు నెలలు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు RBI నిపుణులు, అధికారులు, సాంకేతిక బృందాలతో కలిసి పనిచేసే అవకాశం పొందుతారు. ఆర్థిక రంగాలలో కెరీర్ ఎంచుకోవాలనుకునే ఏ విద్యార్థి కెరీర్‌కైనా గొప్ప అనుభవం కానుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? • ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు • ఇంటిగ్రేటెడ్ 5 సంవత్సరాల కోర్సు చదువుతున్న విద్యార్థులు • 3 సంవత్సరాల LLB చేస్తున్న విద్యార్థులు కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ వంటి సబ్జెక్టులతో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ సబ్జెక్టుల విద్యార్థులకు ఆర్థిక వ్యవస్థపై నాలెడ్జ్ పొందే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో బ్యాంకింగ్ లేదా ఆర్థిక రంగంలో ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగు చేసుకోవచ్చు. కీలకమైన ఆర్థిక రంగంపై అవగాహన పెరుగుతుంది. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంపిక ఎలా జరుగుతుంది? ఈసారి RBI మొత్తం 125 సీట్లకు ఇంటర్న్‌లను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఇంత తక్కువ సీట్లలో ఎంపికవడం అంత సులభం కాదు. ఎందుకంటే దేశం నలుమూలల నుండి దరఖాస్తులు వస్తాయి. ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఇందులో షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. Also Read: CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఎక్కడ, ఎలా దరఖాస్తు చేయాలి? దశ 1: దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు మొదట RBI అధికారిక వెబ్‌సైట్ opportunities.rbi.org.inని సందర్శించాలి దశ 2: ఇక్కడ Current Vacancies, తరువాత Summer Placement విభాగంపై క్లిక్ చేయండి. దశ 3: ఆన్‌లైన్ వెబ్-బేస్డ్ అప్లికేషన్ ఫారంను తెరవండి. దశ 4: మీ పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్, విద్యార్హతలు మొదలైన అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. దశ 5: ఫోటో, సిగ్నేచర్, సంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయండి. దశ 6: అవసరమైన ఫారమ్‌ను సబ్మిట్ చేసిన తరువాత డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
Regional Description: 