News Tuesday, June 10, 2025 - 09:35

Select District: 
News Items: 
Description: 
Teacher Jobs: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్ (PRT) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి University of Hyderabad Recruitment | హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) తమ క్యాంపస్ స్కూల్‌లో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నియామకాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలిపింది. కేవలం 6 నెలల కోసం ఆ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూన్ 21, 2025 నుంచి డిసెంబర్ 25 2025 వరకు వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు UoH అధికారిక వెబ్‌సైట్ https://uohyd.ac.in/ లో ఉన్న వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ చేసిన కాపీల సెట్‌తో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. జూన్ 16 , 17 తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి View Pdf నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి View Pdf PRT ప్రైమరీ, పీఆర్‌టీ తెలుగు, పీఆర్‌టీ హిందీ, టీజీటీ తెలుగు, టీజీటీ హిందీ, టీజీటీ ఆర్ట్స్ ఎడ్యుకేషన్, టీజీటీ పిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు జూన్ 16న ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది. అదే విధంగా పీజీటీ కంప్యూటర్ సైన్స్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ సోషల్ సైన్స్, టీజీటీ సైన్స్, పీఆర్‌టీ ఈవీఎస్/ ఇంగ్లీష్ / మ్యాథ్స్ సబ్జెక్టుల పోస్టులకు జూన్ 17న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. పీజీటీ 1 పోస్టు, వేతనం నెలకు రూ.48000 టీజీటీ 9 పోస్టులు, వేతనం నెలకు రూ.45000 ప్రైమరీ టీచర్ 9 పోస్టులు, వేతనం నెలకు రూ.35000
Regional Description: 