News Wednesday, May 28, 2025 - 16:08
Submitted by andhra on Wed, 2025-05-28 16:08
Select District:
News Items:
Description:
SBI CBO Jobs 2025: డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు మంచి అవకాశం- 2600 ఖాళీల భర్తీకి SBI నోటిఫికేషన్
SBI CBO Jobs 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హత ఉన్న వాళ్లంతా అప్లై చేసుకోవచ్చు.
ఎస్బిఐ ఉద్యోగాలు
SBI CBO Jobs 2025: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే, ఇక్కడ మంచి అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) 2600 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, ఇది మే 29, 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ sbi.co.in లేదా ibpsonline.ibps.in/sbicboapr25/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ఏమిటి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, మెడికల్, ఇంజినీరింగ్ లేదా CA వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, అభ్యర్థులు బ్యాంకింగ్ రంగం లేదా ఏదైనా ఆర్థిక సంస్థలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థి వయస్సు ఏప్రిల్ 30, 2025 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. SC/ST/OBC వంటి రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వం నిర్ణయించిన రిలాక్సేషన్ లభిస్తుంది.
దరఖాస్తు ఫీజు ఎంత?
ఈ భర్తీకి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. జనరల్, OBC, EWS వర్గాల అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. SC/ST, PWD వర్గాల అభ్యర్థుల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చెల్లించాల్సిన పని లేదు.
ఎలా దరఖాస్తు చేయాలి
1. అభ్యర్థులు ముందుగా ibpsonline.ibps.in/sbicboapr25/ విజిట్ చేయాలి.
2. “Click here for New Registration”పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలతో నింపాలి.
3. తరువాత మీ ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
4. తరువాత, మిగిలిన వివరాలను పూరించి, ఫారమ్ ఫైనల్‌గా చెక్ చేసి, ఫీజు చెల్లించండి.
5. దరఖాస్తు పూర్తయిన తర్వాత, దాని ప్రింట్ అవుట్‌ను భద్రపరచుకోండి.
Regional Description: