News Thursday, May 15, 2025 - 09:51

Select District: 
News Items: 
Description: 
Technical Graduate Course: రాత పరీక్షలేకుండానే లెఫ్టినెంట్ ఉద్యోగం- యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్మీ Technical Graduate Course: ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు, చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఆర్మీ పిలుస్తోంది. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. రాత పరీక్షలేకుండానే లెఫ్టినెంట్ ఉద్యోగం- యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్మీ Technical Graduate Course:భారత్‌ ఆర్మీలో పని చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇరవై ఏడేళ్ల లోపు ఉన్న వాళ్లు దీన్ని చక్కగా వినియోగించుకోవాలని సూచించింది. ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని ఇవ్వబోతోంది. పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణల్లో భారత్ ఆర్మీ విరోచితంగా పోరాడింది. మేడిన్ ఇండియా వెపన్స్‌తో పాకిస్థాన్ ఆయుధాలను నిర్వీర్యం చేసింది. పాకిస్థాన్‌లోకి వెళ్లి వాళ్ల సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేసింది. ఉగ్రవాదులను చంపేసింది. ఇలా అన్నింటినీ కూడా కేవలం స్వదేశీ మేథోశక్తితో తయారు చేసిన వాటితోనే సాధ్యమైంది. అందుకే దీన్ని మరింతగా పెంచేందుకు ఆర్మీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువతరాన్ని ఆర్మీలోకి రప్పించేందుకు జాబ్ నోటిఫికేషన్ వేసింది. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో జనవరి 2026లో ప్రారంభమయ్యే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-142) కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆర్మీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.... ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లైనా లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్లైనా అప్లే చేసుకోవచ్చు. వాళ్ల కోసం ప్రత్యేకంగా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సును డిజైన్ చేశారు. జనవరి నుంచి ఈ ట్రైనింగ్ ప్రారంభంకానుంది. ఎవరు అర్హులు వివాహం కాని వ్యక్తులు ఈ కోర్సు చేయడానికి అర్హులు. B.E./B.Tech గ్రాడ్యుయేట్ లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు 01 జనవరి 2026 నాటికి అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మార్కుషీట్‌లతోపాటు ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రూఫ్‌లు ఇవ్వాలి. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో శిక్షణ ప్రారంభించిన తేదీ నుంచి 12 వారాలలోపు ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్‌ సమర్పించాలి. లేకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో శిక్షణ ఖర్చు, చెల్లించిన స్టైపెండ్, జీతం, అలవెన్సులు తిరిగి తీసుకుంటామనే బాండ్ తీసుకుంటారు. సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఫెయిల్ అయితే మాత్రం వాటిని వసూలు చేస్తారు. వయసు ఎంత ఉండాలి 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లు, 27 వయసు మించిన వాళ్లు అనర్హులు. అంటే 2 జనవరి1999 నుంచి 1 జనవరి 2006 మధ్య పుట్టిన వాళ్లు మాత్రమే అప్లే చేసుకోవాల్సి ఉంటుంది. శారీరక ప్రమాణాలు పని చేయాల్సింది ఆర్మీలో కాబట్టి కనీస శారీరక ప్రమాణాలు ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. పది నిమిషాల 30 సెకన్లలో2.4 కిలోమీటర్లు పరుగెత్తగలగాలి. 40 పుష్‌ అప్స్‌ తీయాలి. పుల్‌ అప్స్‌ 06, సిట్‌ అప్స్‌ 30 తీసే శక్తి ఉండాలి. స్క్వాట్స్ రెండు సెట్లు 30 రిపిటేషన్ చేయాలి. లంగ్స్ రెండు సెట్లు 10 రిపిటేట్ చేయాలి. ఈత కొట్టడంలో ప్రాథమిక సూత్రాలు తెలియాలి. వెకెన్సీలు ఎన్ని ఆర్మీకు అవసరమైన ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లను మాత్రమే ఎంపిక చేస్తారు. ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. Civil- 8, Computer Science-6, Electrical-2, Electronics-6, Mechanica-6, Misc Engg Streams-2 ఈ స్ట్రీమ్‌లకు సంబంధించిన ఇతర విభాగాల్లో ఇంజినీరింగ్ చేసిన వాళ్లే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎంపిక ఎలా ఉంటుంది. కేంద్ర రక్షణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. చివరి సెమిస్టర్ వరకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయిస్తారు. చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు తాత్కాలికంగా SSBలో హాజరుకావడానికి అనుమతి ఇస్తారు. తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా అసదరు అభ్యర్థికి కటాఫ్ కంటే తక్కువ మార్కుల వస్తే తన అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత సెంటర్ కేటాయింపు అభ్యర్థికి ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఎంపిక కేంద్రం కేటాయింపు తర్వాత, అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, అందుబాటులో ఉన్న SSB తేదీలను ఎంచుకోవాలి. ఆ తర్వాత, ఎంపిక కేంద్రాలు దానిని కేటాయిస్తాయి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకే సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ప్రయాగ్‌రాజ్ (యుపి), భోపాల్ (ఎంపి), బెంగళూరు (కర్ణాటక), జలంధర్ (పంజాబ్) ఎంపిక కేంద్రాల్లో ఒకచోట ఇంటర్వ్యూ చేస్తారు. SSB ఇంటర్వ్యూ కోసం కాల్ అప్ లెటర్‌ను సంబంధిత ఇ-మెయిల్ ఐడి SMS ద్వారా మాత్రమే జారీ చేస్తారు. రెండు దశల్లో ఎంపిక విధానం అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. స్టేజ్-1లో పాస్ పర్సంటేజ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. వారిని స్టేజ్-2కి పంపిస్తారు. స్టేజ్-1లో విఫలమైన వారిని అదే రోజున పంపేస్తారు. SSB ఇంటర్వ్యూల వ్యవధి ఐదు రోజులు ఉంటుంది. వాటి వివరాలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రిక్రూటింగ్ అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in లో అందుబాటులో ఉంచుతారు. స్టేజ్ 2లో ఎంపికైన వారికి వైద్య పరీక్షలు చేస్తారు. SSB సిఫార్సు చేసిన, వైద్యపరంగా ఫిట్‌గా ఉన్న అభ్యర్థులకు, అన్ని అర్హత ప్రమాణాలు ఉంటే, అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి మెరిట్ ఆధారంగా శిక్షణ కోసం జాయినింగ్ లెటర్ జారీ చేస్తారు. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఎంపికైన అభ్యర్థులను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ కోసం ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారీగా ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి ట్రైనింగ్ ఇస్తారు. దాదాపు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. తల్లిదండ్రులు, సంరక్షకులతో కలిసి ఉండేందుకు అనుమతించరు. అభ్యర్థులు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో పూర్తి శిక్షణ పూర్తి చేసే వరకు వివాహం చేసుకోకూడదు. ఒక అభ్యర్థి శిక్షణలో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే, డిశ్చార్జ్ వెంటనే ఇంటికిపంపేస్తారు. అప్పటి వరకు ప్రభుత్వం చేసిన ఖర్చులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత కూడా వివాహం చేసుకుంటే సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలో విజయం సాధించినప్పటికీ, శిక్షణకు పంపించరు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య కారణాల వల్ల లేదా అతని నియంత్రణకు మించిన కారణాల వల్ల జెంటిల్‌మన్ క్యాడెట్ శిక్షణ అకాడమీ నుంచి వెదొలగితే వారానికి ₹ 16260 చొప్పున ఖర్చులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత కారణాల వల్ల ఉపసంహరించుకునే అభ్యర్థుల నుంచి కూడా శిక్షణ ఖర్చు వసూలు చేస్తారు. ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకు లెఫ్ట్‌నెంట్‌లుగా ఉద్యోగాలు ఇస్తారు. శికణ సమయంలో నెలకు 56100 రూపాయుల స్టైఫండ్‌ ఇస్తారు.
Regional Description: 