News Monday, March 3, 2025 - 11:07

Select District: 
News Items: 
Description: 
CISF: సీఐఎస్‌ఎఫ్‌లో 1161 కానిస్టేబుల్ పోస్టులు - టెన్త్ అర్హత చాలు సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు CISF Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1161 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 945 పోస్టులు పురుషులకు, మహిళలకు 103 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 113 పోస్టులు కేటాయించారు. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. వివరాలు.. * కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు ఖాళీల సంఖ్య: 1161 ⏩ కుక్‌: 493 పోస్టులు ➥ పురుషులు: 400 పోస్టులు ➥ మహిళలు: 44 పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 49 పోస్టులు ⏩ కాబ్లర్‌: 09 ➥ పురుషులు: 07 పోస్టులు ➥ మహిళలు: 01పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 01 పోస్టులు ⏩ టైలర్‌: 23 పోస్టులు ➥ పురుషులు: 19 పోస్టులు ➥ మహిళలు: 02 పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 02 పోస్టులు ⏩ బార్బర్‌: 199 పోస్టులు ➥ పురుషులు: 163 పోస్టులు ➥ మహిళలు: 17 పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 19 పోస్టులు ⏩ వాషర్‌మెన్‌: 262 పోస్టులు ➥ పురుషులు: 212 పోస్టులు ➥ మహిళలు: 24 పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 26 పోస్టులు ⏩ స్వీపర్‌: 152 పోస్టులు ➥ పురుషులు: 123 పోస్టులు ➥ మహిళలు: 14 పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 15 పోస్టులు ⏩ పెయింటర్‌: 02 పోస్టులు ➥ పురుషులు: 02 పోస్టులు ⏩ కార్పెంటర్‌: 09 పోస్టులు ➥ పురుషులు: 07 పోస్టులు ➥ మహిళలు: 01 పోస్టులు ➥ ఎక్స్-సర్వీస్‌మెన్: 01 పోస్టులు ⏩ ఎలక్ట్రీషియన్‌: 04 పోస్టులు ➥ పురుషులు: 04 పోస్టులు ⏩ మాలి: 04 పోస్టులు ➥ పురుషులు: 04 పోస్టులు ⏩ వెల్డర్‌: 01 పోస్టు ➥ పురుషులు: 01 పోస్టు ⏩ చార్జ్‌ మెకానిక్‌: 01 పోస్టు ➥ పురుషులు: 01 పోస్టు ⏩ ఎంపీ అటెండెంట్‌: 02 పోస్టులు ➥ పురుషులు: 02 పోస్టులు అర్హత: పదో తరగతి లేదా తత్సమానం. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులు: ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ: 80-85 సెం.మీ. మహిళా అభ్యర్థులు: ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి. వయోపరిమితి: 01.08.2025 నాటికి 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.2002 - 01.08.2007 మధ్య జన్మించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100. రాత పరీక్ష విధానం: పీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ ఇంగ్లిషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ముఖ్యమైన తేదీలు... ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.04.2025
Regional Description: 