News Wednesday, January 29, 2025 - 10:38

Select District: 
News Items: 
Description: 
RPF Constable Exam: ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరీక్షల షెడ్యూల్ వెల్లడి - 19 రోజులపాటు కొనసాగనున్న పరీక్షలు RPF: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్ష తేదీలను రైల్వేశాఖ ప్రకటించింది. అభ్యర్థులకు మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పరీక్ష తేదీలు RPF Constable Exam Dates: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(RPF)లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్షల తేదీలను రైల్వే శాఖ జనవరి 28న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను పరీక్షకు పది రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, మార్గదర్శకాలు తదితర వివరాలు ఉంటాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. కానిస్టేబుల్ పరీక్ష అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులు పరీక్షకు 4 రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌లో మొత్తం 4,660 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 452 సబ్ ఇన్‌స్పెక్టర్(SI), 4208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 15 నుంచి 24 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికే ఎస్‌ఐ పోస్టులకు గతేడాది డిసెంబర్‌ 2, 3, 9, 12, 13 తేదీల్లో నియామక పరీక్షలు నిర్వహించారు. ఇక తాజాగా కానిస్టేబుల్ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రాతపరీక్ష విధానం.. మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, అరిథ్‌మెటిక్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఆర్‌పీఎఫ్ పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్): రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ కింది విధంగా ఉంటుంది. విభాగం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు లాంగ్ జంప్ హైజంప్ ఎస్‌ఐ (మెన్) 6.30 నిమిషాలు - 12 ఫీట్లు 3 ఫీట్ల 9 అంగుళాలు ఎస్‌ఐ (ఉమెన్) - 4 నిమిషాలు 9 ఫీట్లు 3 ఫీట్లు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT): ఆర్‌పీఎఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) విభాగం ఎత్తు (సెం.మీ.లలో ) ఛాతీ (సెం.మీ.లలో ){పురుషులకు మాత్రమే} జనరల్/ఓబీసీ 165 157 80 85 ఎస్సీ/ఎస్టీ 160 152 76.2 81.2 గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు, డోగ్రాలు, కుమాయోనీస్ మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర కేటగిరీలకు చెందినవారికి 163 155 80 85 డాక్యుమెంట్ వెరిఫికేషన్: అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా సరైన అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నవారికి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - NOC) తీసుకోవాల్సి ఉంటుంది.
Regional Description: 