News Tuesday, September 24, 2024 - 10:16

Select District: 
News Items: 
Description: 
RRB Notification 2024: ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే RRB NTPC Jobs: ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (అండర్ గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. RRB - ఎన్టీపీసీ యూజీ నోటిఫికేషన్ RRB Recruitment 2024 Notification: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) అండర్ గ్రాడ్యుయేట్(NTPC-Under Graduate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 3445 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. ఈ పోస్టుల భర్తీకీ సెప్టెంబరు 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అంటే అక్టోబరు 20 రాత్రి 11.59 తర్వాత.. అక్టోబరు 21, 22 తేదీల్లో నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. వివరాలు.. * ఆర్ఆర్‌బి - ఎన్టీపీసీ యూజీ పోస్టులు ఖాళీల సంఖ్య: 3445 ➥ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు జీతం: రూ.21700. ➥ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు జీతం: రూ.19900 ➥ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు జీతం: రూ.19900 ➥ ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు జీతం: రూ.19900 రైల్వే జోన్లవారీగా ఖాళీలు.. జోన్ ఖాళీల సంఖ్య సికింద్రాబాద్ 89 అహ్మదాబాద్ 210 అజ్మేర్ 71 బెంగళూరు 60 భోపాల్ 58 భువనేశ్వర్ 56 బిలాస్‌పూర్ 152 ఛండీగఢ్ 247 చెన్నై 194 గోరఖ్‌పూర్ 120 గువాహటి 175 జమ్మూ, శ్రీనగర్ 147 కోల్‌కతా 452 మాల్దా 12 ముంబయి 699 ముజఫర్‌పూర్ 68 ప్రయాగ్‌రాజ్ 389 పాట్నా 16 రాంచీ 76 సిలిగురి 42 తిరువనంతపురం 112 మొత్తం 3445 అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్‌‌పై ఇంగ్లిష్/హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ(NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటిగిరీలవారీగా జనరల్/ఈడబ్ల్యూఎస్ 3 సంవత్సరాలు, ఓబీసీ-6, ఎస్సీ/ఎస్టీ 8 సంవత్సరాలు; దివ్యాంగులు 10-15 సంవత్సరాలు; ఇతరులకు రైల్వే నిబంధనల మేరకు వయోసడలింపులు ఉంటాయి. పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్టేజ్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇక దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తారు. వీరికి పరీక్ష సమయంలో మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, టైపింగ్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
Regional Description: 