News Tuesday, September 24, 2024 - 10:06

News Items: 
Description: 
Railway Jobs: రైల్వేశాఖలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం RRB: ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్ RRB NON TECHNICAL POPULAR CATEGORIES (NTPC) GRADUATE POSTS: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకీ సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. వివరాలు.. * ఎన్టీపీసీ పోస్టులు ఖాళీల సంఖ్య: 8113 పోస్ట్ పేరు 7వ CPC ప్రకారం చెల్లింపు స్థాయి ప్రారంభ వేతనం (రూ.) వైద్య ప్రమాణం 01.01.2025 నాటికి వయసు మొత్తం ఖాళీలు (అన్ని RRBలు) చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 6 35400 B2 18-36 1736 స్టేషన్ మాస్టర్ 6 35400 A2 18-36 994 గూడ్స్ రైలు మేనేజర్ 5 29200 A2 18-36 3144 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 5 29200 C2 18-36 1507 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5 29200 C2 18-36 732 మొత్తం ఖాళీలు - - - - 8113 రైల్వే జోన్లవారీగా ఖాళీలు..  సికింద్రాబాద్: 478  అహ్మదాబాద్: 516  అజ్మేర్: 132  బెంగళూరు: 496  భోపాల్: 155  భువనేశ్వర్: 758  బిలాస్‌పూర్: 649  ఛండీగఢ్: 410  చెన్నై: 436  గోరఖ్‌పూర్: 129  గువాహటి: 516  జమ్మూ, శ్రీనగర్: 145  కోల్‌కతా: 1382  మాల్దా: 198  ముంబయి: 827  ముజఫర్‌పూర్: 12  ప్రయాగ్‌రాజ్: 227  పాట్నా: 111  రాంచీ: 322  సిలిగురి: 40  తిరువనంతపురం: 174
Regional Description: 