News Thursday, September 19, 2024 - 09:38

Select District: 
News Items: 
Description: 
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా MHSRB: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి వైద్యారోగ్య సేవల బోర్డు సెప్టెంబరు 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫకేషన్ Telangana Nursing Officer Notification: తెలంగాణలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో 2050 నర్సుల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) సెప్టెంబరు 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్‌ విభాగంలో 61 పోస్టులు, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 17న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలు.. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీల సంఖ్య: 2050. జోన్లవారీగా ఖాళీలు.. జోన్ ఖాళీలు జోన్-1 241 జోన్-2 86 జోన్-3 246 జోన్-4 353 జోన్-5 187 జోన్-6 747 జోన్-7 114 విద్యార్హత: జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వయోపరిమితి: 08.02.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానంల ఉంటుంది. ఇందులో రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది. జీతం: రూ.36,750 – రూ.1,06,990 ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.9.2024. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 14.10.2024 5.00 pm ➥ దరఖాస్తుల సవరణ: 16.10.2024 (10.30 AM) 17.10.2024 to 5.00 PM ➥ ఆన్‌లైన్ పరీక్ష (సీబీటీ) తేదీ: 17.11.2024.
Regional Description: 