News Tuesday, July 30, 2024 - 17:32
Submitted by andhra on Tue, 2024-07-30 17:32
Select District:
News Items:
Description:
RRB JE Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 7951 'రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తు ప్రారంభం
RRB JE Recruitment 2024 Notification: రైల్వేశాఖలో జూనియర్ ఇంజినీర్, ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్
Railway Recruitment Board JE Recruitment Notification: దేశంలోని నిరుద్యోగులకు రైల్వేశాఖ తీపి కబురు వినిపించింది. రైల్వేశాఖ పరిధిలోని వివిధ జోన్లలో 7,951 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కెమికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రిసెర్చ్, జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాలకు డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 30 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళలు, ట్రాన్స్జెండర్లు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రెండు దశల రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 7,951.
జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు కెమికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ (ఆర్ఆర్బీ గోరఖ్పూర్ మాత్రమే): 17 పోస్టులు
అర్హత: పోస్టులవారీగాసంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ (సివిల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ మహిళలు/ ట్రాన్స్జెండర్లకు రూ.250.
Regional Description: