News Wednesday, July 10, 2024 - 09:38

News Items: 
Description: 
Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో బీటెక్ కోర్సు, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం - వివరాలు ఇలా INDIAN NAVY: ఇండియన్‌ నేవీ పరిధిలోని కేరళలోని ఐఎన్‌ఏ ఎజిమలలో ప్రారంభం కానున్న 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీం జనవరి 2025 కింద బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇండియన్ నేవీ ఉద్యోగాలు Indian Navy 10+2 BTech Entry Scheme: ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి (జనవరి 2025 బ్యాచ్) నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2024 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జులై 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంలలో 2024, సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు. వివరాలు.. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్) విభాగాలు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్. ఖాళీలు: 40 (ఇందులో మహిళలకు 8 పోస్టులు కేటాయించారు) కోర్సు ప్రారంభం: 2025 జనవరిలో. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులలో కనీసం 70 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. వీటితోపాటు జేఈఈ (మెయిన్)-2024 పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. వయోపరిమితి: 02.07.2005 నుంచి 01.01.2008 మధ్య జన్మించిన వారై ఉండాలి.
Regional Description: 