News Thursday, June 27, 2024 - 10:20

Select District: 
News Items: 
Description: 
SSC CGL Notification 2024: 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ SSC CGLE 2024: కేంద్ర ప్రభుత్వశాఖల్లో 17 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. సీజీఎల్ఈ - 2024 నోటిఫికేషన్ SSC Combined Graduate Level Examination 2024 Notification: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. వివరాలు.. ఖాళీల సంఖ్య: 17,727 ➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ➥ అసిస్టెంట్ ➥ ఇన్‌స్పెక్టర్ - (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్) ➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) ➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్) ➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI) ➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ) ➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్ ➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్ ➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్) ➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC) ➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC) ➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్) ➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (NIA) ➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ) ➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్) ➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్) ➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,) ➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,) ➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ➥ జూనియర్ అకౌంటెంట్ (CGCA) ➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్) ➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ➥ అప్పర్ డివిజన్ క్లర్క్ ➥ ట్యాక్స్ అసిస్టెంట్ అర్హత: ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి. వయోపరిమితి: 01.08.2024 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-30, కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు 3- సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు (డిసేబుల్డ్) - 8 సంవత్సరాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు, ఒంటరి/విడాకులు తీసుకున్న మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా. జీతం: ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.06.2024. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.07.2024 (23:00) ➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 25.07.2024 (23:00) ➥ దరఖాస్తుల సవరణ: 10.08.2024 - 11.08.2024(23:00) వరకు ➥ టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): సెప్టెంబరు/అక్టోబరు, 2024. ➥ టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2024.
Regional Description: 