News Friday, December 15, 2023 - 10:18

Select District: 
News Items: 
Description: 
SBI Jobs: ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే? SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియను డిసెంబరు 17 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. SBI - సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ దరఖాస్తు పొడిగింపు ( Image Source : SBI ) SBI CBO Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా వివిధ ఎస్‌బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,447 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్- 425, అమరావతి- 400 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 12తో గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును డిసెంబరు 17 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 5,447 (రెగ్యులర్ ఖాళీలు- 5,280; బ్యాక్‌లాగ్ ఖాళీలు- 167) * సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు ఎస్‌బీఐ సర్కిళ్లు: అహ్మదాబాద్, అమరావతి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్‌ ఈస్ట్రన్‌, హైదరాబాద్, జైపుర్, లఖ్‌నవూ, కోల్‌కతా, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూదిల్లీ, తిరువనంతపురం. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. బ్యాంకింగ్‌ రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 31.10.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. జీత భత్యాలు: రూ.36,000-రూ.63,840. తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.11.2023. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023. (17.12.2023 వరకు పొడిగించారు) ➥ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జనవరి 2024. ➥ ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 2024.
Regional Description: 