News Tuesday, November 14, 2023 - 17:16

Select District: 
News Items: 
Description: 
ITBP Constable Notification: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు రూ.69,100 వరకు జీతం ITBP Jobs: భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ), స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఐటీబీపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ Indo Tibetan Border Police Constable: భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ), స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 248 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 13 నుంచి ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఖాళీల వివరాలు.. * కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టులు ఖాళీల సంఖ్య: 248 పోస్టులు కేటగిరీ: గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) క్రీడాంశాలవారీగా ఖాళీలు.. ⦁ అథ్లెటిక్స్: 42 పోస్టులు (మెన్-27, ఉమెన్-15) ⦁ ఆక్వాటిక్స్: 39 పోస్టులు (మెన్-39) ⦁ ఈక్వెస్ట్రియన్: 08 పోస్టులు (మెన్-08) ⦁ స్పోర్ట్స్ షూటింగ్: 35 పోస్టులు (మెన్-20, ఉమెన్-15) ⦁ బాక్సింగ్: 21 పోస్టులు (మెన్-13 ఉమెన్-08) ⦁ ఫుట్‌బాల్: 19 పోస్టులు (మెన్-19) ⦁ జిమ్నాస్టిక్: 12 పోస్టులు (మెన్-12) ⦁ హాకీ: 07 పోస్టులు (మెన్-07) ⦁ వెయిట్ లిఫ్టింగ్: 21 పోస్టులు (మెన్-14, ఉమెన్-07) ⦁ ఉషు: 02 పోస్టులు (మెన్-02) ⦁ కబడ్డీ: 05 పోస్టులు (ఉమెన్-05) ⦁ రెజ్లింగ్: 06 పోస్టులు (మెన్-06) ⦁ ఆర్చరీ: 11 పోస్టులు (మెన్-04, ఉమెన్-07) ⦁ కయాకింగ్: 04 పోస్టులు (ఉమెన్-04) ⦁ కానోయింగ్: 06 పోస్టులు (ఉమెన్-06) ⦁ రోయింగ్: 10 పోస్టులు (మెన్-02 ఉమెన్-08) అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: అర్హతలు, క్రీడా ప్రతిభ ఆధారంగా. పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100. ముఖ్యమైన తేదీలు... ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.11.2023. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.11.2023.
Regional Description: 