News Friday, November 3, 2023 - 11:05

News Items: 
Description: 
ఆంధ్రప్రదేశ్ Weather Report: భారీ వర్ష సూచన.. IMD వాతావరణ రిపోర్ట్ Andhra Pradesh and Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది? IMD ఏం చెప్పిందో తెలుసుకుందాం.. భారత వాతావరణ విభాగం (IMD) తాజా బులిటెన్ ప్రకారం కేరళలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే కేరళ, తమిళనాడులో రేపు భారీ వర్షాలు పడతాయి. అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో వారం పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో తూర్పు, ఈశాన్యం వైపు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. అందువల్ల దక్షిణ రాష్ట్రాల్లో మేఘాల కదలిక ఎక్కువగా ఉంది. వారం పాటూ దక్షిణ రాష్ట్రాల్లో (తమిళనాడు, కేరళ, కర్ణాటక) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాలపై మేఘాలు బాగా ఉంటాయి. ఉదయం వేళ కోస్తా, తూర్పు రాయలసీమలో జల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం 2 తర్వాత తూర్పు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయి. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. తెలంగాణలో వర్షం కురవకపోయినా, మేఘాలు, వేగవంతమైన గాలులు ఉంటాయి. ఉష్ణోగ్రతలను గమనిస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 21 డిగ్రీల సెల్సియస్, మాగ్జిమం 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రాత్రివేళ మినిమం 25 డిగ్రీల సెల్సియస్, మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మినిమం 22 డిగ్రీల సెల్సియస్, మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో మినిమం 26 డిగ్రీల సెల్సియస్, మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ప్రస్తుతం తూర్పు ఆసియాలో పెద్దగా తుఫాన్లేవీ లేవు. అక్కడ వాతావరణం దాదాపు ప్రశాంతంగా ఉంది. కేరళపై మాత్రం అల్పపీడనం ఉంది. దాని ప్రభావం దక్షిణ రాష్ట్రాలపై కనిపిస్తోంది.
Regional Description: 