News Monday, October 16, 2023 - 10:46

Select District: 
News Items: 
Description: 
NTPC Recruitment: ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎన్టీపీసీ ఈఈటీ నోటిఫికేషన్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల సంఖ్య: 495. రిజర్వేషన్లు: జనరల్-237, ఈడబ్ల్యూఎస్-36, ఓబీసీ-126, ఎస్సీ-58, ఎస్టీ-38. విభాగాలవారీగా ఖాళీలు.. ➥ ఎలక్ట్రికల్: 120 ➥ మెకానికల్: 200 ➥ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్: 80 ➥ సివిల్: 30 ➥ మైనింగ్: 65 అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వయోపరిమితి: 20.10.2023 నాటికి 27 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, గేట్-2023 స్కోరు ఆధారంగా. జీతం: నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. సర్వీస్‌బాండ్: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో ఏడాది శిక్షణ తర్వాత మూడేళ్లపాటు విధిగా పనిచేస్తామంటూ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.5 లక్షలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2.5 లక్షలకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 06.10.2023. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2023.
Regional Description: 