News Friday, May 26, 2023 - 11:25
Submitted by andhra on Fri, 2023-05-26 11:25
Select District:
News Items:
Description:
Indian Navy: ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్
Share:
ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో (02/2023-నవంబర్ 23 బ్యాచ్) శిక్షణ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 29 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రిక్యులేషన్ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
వివరాలు..
* అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్- ఎంఆర్)
మొత్తం ఖాళీలు: 100 పోస్టులు(మెన్-80, ఉమెన్-20)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: 01.11.2002 - 31.04.2005 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.550.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
శిక్షణ వివరాలు: అగ్నివీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29.05.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15.06.2023.
➥ శిక్షణ ప్రారంభం: 2023, నవంబరులో.
Regional Description: