News Tuesday, May 23, 2023 - 10:23

Select District: 
News Items: 
Description: 
హైదరాబాద్లో మరో అమెరికా సంస్థ, 9 వేల మంది యువతకు ఉద్యోగాలు! హైదరాబాద్లో మరో అమెరికా సంస్థ ఏర్పాటుకానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు అలియంట్ సంస్థ హైదరాబాద్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో అలియంట్ గ్రూప్ Share: హైదరాబాద్లో మరో అమెరికా సంస్థ ఏర్పాటుకానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు అలియంట్ సంస్థ హైదరాబాద్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీకి చెందిన సీఈవో ధవల్ జాదవ్ను హూస్టన్లో మంత్రి కేటీఆర్ కలిశారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పవర్హౌజ్గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .. హైదరాబాద్లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్తగా 9 వేల మందిని రిక్రూట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇదొక సదావకాశం అవుతుందని మంత్రి తెలిపారు. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారుతోందని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఆ నగరంపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపుతుందని మంత్రి తన ట్వీట్లో వెల్లడించారు. హూస్టన్లో ఉన్న అలియంట్ గ్రూపు ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్కు అక్కడ ఘన స్వాగతం లభించింది.
Regional Description: 