News Friday, May 12, 2023 - 10:23

Select District: 
News Items: 
Description: 
NTPC Jobs: ఎన్టీపీసీలో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టులు - అర్హతలివే! న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ & ఏసీఈ ఉద్యోగాలు Share: న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు నియామక పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీచేస్తారు. వివరాలు.. ఖాళీల సంఖ్య: 120 1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్): 100 పోస్టులు పోస్టుల కేటాయింపు: జనరల్-41, ఈడబ్ల్యూఎస్-10, ఓబీసీ-27, ఎస్సీ-15, ఎస్టీ-07. 2) అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్): 20 పోస్టులు పోస్టుల కేటాయింపు: జనరల్-10, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-05, ఎస్సీ-03, ఎస్టీ-01. అర్హత: బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్), పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి. వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. జీత భత్యాలు: నెలకు రూ.55,000. దరఖాస్తు ఫీజు: రూ.300. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన తేదీలు.. * ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.05.2023. * ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.05.2023.
Regional Description: 