News Sunday, April 23, 2023 - 09:46

Select District: 
News Items: 
Description: 
23/04/2023: Rains In AP: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్ల క్రింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఆదివారం ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
Regional Description: 