News Sunday, January 29, 2023 - 11:59

Select District: 
News Items: 
Description: 
Post Office Jobs: భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, అర్హత పదవ తరగతి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ఇదే మంచి అవకాశం. పోస్టాఫీసులో ఏకంగా 40 వేల ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. కేవలం పదవ తరగతి విద్యార్హతతో, ఏ విధమైన ప్రవేశపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలు భర్తీ చేయనుంది పోస్టల్ డిపార్ట్‌మెంట్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీసులో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40 వేల 889 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాల్ని ఏ విధమైన ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, లేకుండా పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 16 వరకూ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకూ అవకాశాలున్నాయి. వయస్సు 18-40 ఏళ్ల లోపుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కొద్దిగా అవసరం. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో ఏపీలో 2480, తెలంగాణలో 1260 ఉద్యోగాలున్నాయి. ఎంపికైన వారు పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి ప్రారంభవేతనం 10 వేల నుంచి 12 వేలవరకూ ఉంటుంది. ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి 12 వేల నుంచి 29,380 రూపాయలుంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ ఉద్యోగానికి 10 వేల నుంచి 24 వేల 470 రూపాయలుంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్ధులు తప్పించి మిగిలినవాళ్లు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఉంటాయి. పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు గణితం, ఇంగ్లీషు, స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ ను చూడగలరు.
Regional Description: 