News Wednesday, January 18, 2023 - 10:31
Submitted by andhra on Wed, 2023-01-18 10:31
Select District:
News Items:
Description:
రైలు ప్రయాణీకులకు...ఇకపై ఆనులైనులోనే జనరల్ టికెట్ బకింగ్..... చివరి నిమిషంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణీకులు లేదా దగ్గర దూరం ప్రయాణం చేసే వారు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. ఇలాంటి వారు సంబంధిత రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం చాలాసార్లు క్యూలో నిలబడాలి, ఒక్కోసారి టికెట్ తీసుకునేలోపు రైలు కూడా వెళ్ళిపోతుంది. అయితే ఈ సమస్య అధిగమించేందుకు జనరల్ టికెట్ ప్రయాణీకులకోసం రైల్వేశాఖ కొత్త సర్వీసు తీసుకువచ్చింది. రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చిన “UTS” (అన్ రిజర్వుడు టికెట్ బుకింగ్ సిస్టం) యాప్ ద్వారా జనరల్ టికెటుతోపాటు ప్లాటఫాం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. దీనిద్వారా ప్రయాణీకులు క్యూలోనిలబడాల్సిన అవసరం తప్పుతుంది మరియు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కూడా ఉండదు. దీనికోసం ప్లేస్టోర్ నుంచి యాప్ డౌనులోడు చేసుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చు. జీపీయస్ ఆధారంగా రెండు కిలోమీటర్లు లేదా రైల్వే ట్రాక్ కు 15 మీటర్ల దూరంలో ఉండాలి అలాగే ఇతర నిబంధనలకు అనుగుణంగా ఈ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Regional Description: