News Tuesday, November 29, 2022 - 10:28
Submitted by andhra on Tue, 2022-11-29 10:28
Select District:
News Items:
Description:
ఏపీలో కొత్తగా 6,511 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కొత్తగా 6,511 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 411 ఎస్ఐ, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ ఎస్ఐలు, 96 ఆర్ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,562 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి.....
ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. ఎస్.ఐ ఉద్యోగాలకు వచ్చే నెల 14 నుంచి, కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెలాఖరు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే యేడాది జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు, ఫిబ్రవరి 19న ఎస్.ఐ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
Regional Description: