News Monday, September 26, 2022 - 10:13

News Items: 
Description: 
ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 62.70 లక్షల మంది లబ్దిదారులకు గొప్ప అవకాశం కల్పించింది. ఇకపై లబ్ధిదారుడు తన పెన్షన ఓ చోట నుంచి మరో చోటుకి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. లబ్దిదారులు తమ నివాసాన్ని ఒకచోట నుంచి మరొక చోటుకి మార్చుకునే టైంలో ఆ వివరాలతో గ్రామ, వార్డు సచివాలయంలోదరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనికి తోడు ఇకపై ఎవరైనా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేస్తే.. అది పొరపాటు అయినా.. కావాలి అని చేసినా.. అలా మంజూరు చేసిన అధికారి నుంచే.. ఆ సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రూల్ పెట్టింది ప్రభుత్వం. మరోవైపు వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ ను పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా కుప్పంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ 2, 750కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా వనరులు సమకూర్చే పనిలో ఉన్నారు అధికారులు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫించన్ కానుక కేవలం.. వృద్ధులకే కాదు.. అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్దికంగా తోడ్పాటు అందిస్తోంది ప్రభుత్వం. వితంతు.. వికలాంగ.. చేనేత.. కల్లుగీత.. డయాలసిస్ బాధితులు.. ఒంటరి మహిళ.. ట్రాన్స్ జెండర్.. చర్మకారులు.. తలసేమియా బాధితులు.. పక్షవాతం.. మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు కూడా అందిస్తోంది.
Regional Description: 