News Saturday, August 27, 2022 - 10:05

News Items: 
Description: 
ప్లాస్టిక్‌ బ్యానర్లు బ్యాన్ : రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్‌ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్‌ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్‌ సైక్లింగ్‌తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.
Regional Description: 