News Tuesday, June 14, 2022 - 10:28

Select District: 
News Items: 
Description: 
ఏపీని పలకరించిన రుతుపవనాలు.. ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రుతుపవనాలు తాకాయి.. రాయలసీమను పలకరించాయి. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల ఎంట్రీతో పాటూ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఇప్పటికే కృష్ణా, ఏలూరు, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ ఒక మోస్తరు వానలు కురిశాయి. రుతుపవనాలు ఈ ఏడాది మే 29కల్లా కేరళలో ప్రవేశించాయి.మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంలో కొంత ఆలస్యమైంది. సాధారణంగా జూన్‌ నాలుగు నాటికి రాయలసీమను తాకాల్సి ఉంది. రుతుపవనాల పురోగతిలో వేగం లోపించడంతో రాష్ట్రంలోకి రావడం కొంత ఆలస్యమైంది. సోమవారం నాటికి తిరుపతి వరకు రుతుపవనాలు విస్తరించినా..దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం తప్ప మిగిలినచోట్ల వర్షాలు లేవు. ఈ ఏడాది వర్షాకాలంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని.. ఈ నెలలో రెండు, మూడు వారాల నుంచి వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. నైరుతి సీజన్‌లో సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడతాయి.. జులై, ఆగస్టు నెలల్లో మధ్య కోస్తా జిల్లాలు, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Regional Description: 