News Wednesday, June 8, 2022 - 10:35

Select District: 
News Items: 
Description: 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారు అందిస్తున్న పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.......  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నపుడు ఇంట్లోనే ఉండండి.  సముద్రము మరియు చెరువులకు దగ్గరగా ఉండే వెంటనే వాటినుంచి దూరంగా వెళ్ళాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి.  ఉరుములు శబ్ధం వినగానే పొలంలో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాలలో పనిచేసే వారు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి.  కారు / బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నపుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉండే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించండి.  బహిరంగ ప్రదేశాలలో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి. తద్వారా ఉరుములు, మెరుపుల నుండి రక్షణపొందే అవకాశం ఉంటుంది.  ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి.  పిడుగు బాధితుడిని వెంటనే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళండి. * * * పిడుగుపాటు సమయంలో చేయకూడనివి * * * × ఉరుములు, మెరుపులు సంభవించినపుడు చెట్లకింద, చెట్ల సమీపంలో, టవర్లు, చెరువుల దగ్గర ఉండరాదు. × ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు, మోబైల్ ఫోన్లు ఉపయోగించరాదు. × పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండడం లాంటివి చేయరాదు. × మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్థంబాలకు మరియు ఇతర వస్తువులకు దూరంగా ఉండాలి. × వాహనంలో ఉండి ఉంటే లోహపు భాగాలను తాకరాదు.
Regional Description: 