News Wednesday, June 1, 2022 - 12:34
Submitted by andhra on Wed, 2022-06-01 12:34
Select District:
News Items:
Description:
PMJBY: పీఎం జీవనజ్యోతి, సురక్షభీమా...వార్షిక ప్రీమియం పెంపు....
ప్రధాన మంత్రి జోవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పధకాలకు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం జూన్ 1 నుంచి పెరగనుంది. ఈ రెండు పధకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకుని జీవనజ్యోతి భీమా యోజన ప్రీమియంను రూ. 330 నుంచి రూ. 436కు, సురక్ష భీమా యోజనర ప్రీమియంను రూ. 12 నుంచి రూ.20కి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు పధకాలను ఆర్ధికంగా లాభదాయకంగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు పధకాలను 2015లో ప్రారంభించి చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడేళ్ళపాటు నష్టాలు వస్తున్నప్పటికీ ప్రీమియంను మాత్రం పెంచలేదని ఆర్ధికశాఖ పేర్కొంది.
Regional Description: