News Friday, May 13, 2022 - 17:45
Submitted by andhra on Fri, 2022-05-13 17:45
Select District:
News Items:
Description:
13/5/2022: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. సంవృద్ధిగా వర్షాలు: IMD .....
122 ఏళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా 2022 నిలిచింది. ఈసారి ఎండలు దంచికొట్టడంతో జనం తాపంతో విలవిలలాడారు. అయితే ఇప్పుడు ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. రైతులకూ శుభవార్తను వెలువరించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించబోతున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 15 తేదీన దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలోనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ దాకా వస్తే తెలుగు రాష్ట్రాల సమీపంలోకి రుతుపవనాలు వచ్చినట్లుగానే భావిస్తారు. కేరళ నుంచి నైరుతి వర్ష మేఘాలు తెలంగాణ-ఆంధ్రను చేరడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. ఆపై రెండు వారాల వ్యవధిలోనే దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో, సాధారణ నైరుతి ఆగమన తేదీ(జూన్ 8) కన్నా ముందుగానే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. కాగా, వచ్చే వానాకాలంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. నిజానికి గత రెండేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా దేశమంతటా అధిక వర్షపాతమే నమోదైంది. గతేడాది సకాలంలో(జూన్ 5)నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. గాలుల దిశ మారడంతో జూన్‌లో సరిగా వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడలేదు. అందుకే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మినహా జూన్‌లో భారీ వర్షాలేమీ కురవలేదు.
Regional Description: