News Wednesday, April 13, 2022 - 15:31
Submitted by andhra on Wed, 2022-04-13 15:31
Select District:
News Items:
Description:
ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
మత్స్యకారులు రెండు నెలల పాటువేటకుదూరంకానున్నారు. ఏటా వేసవిలో సంతానోత్పత్తి సీజన్ కావడంతో సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14 వరకూ చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తీరంలో మత్స్యకారులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వేట నిషేధ సమయంలో రూ. 10 వేలను వేసవిభృతిగా అందించనున్నారు. జిల్లాలోని 11 మండలాల్లో 193 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 120 మత్స్యకార గ్రామాల్లో 1, 646 ఇంజన్ బోట్లు, 2, 838 నాన్ ఇంజన్ బోట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా 1, 225 వరకూ రిజిస్టర్ కానివి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంజన్ బోట్లలో ఆరుగురికి, నాన్ ఇంజన్ బోట్లలోముగ్గురుమత్స్యకారులకు మాత్రమే రూ. 10 వేలు చొప్పున వేట నిషేధ భృతి (మత్స్యకార భరోసా) ప్రభుత్వం మంజూరు చేయనుంది. భరోసాకు సంబంధించి ఈ నెల 16 నుంచి తీర గ్రామాల్లో అధికారులు బోట్ల సర్వేను చేయనున్నారు.
Regional Description: