News Thursday, November 18, 2021 - 15:09
Submitted by andhra on Thu, 2021-11-18 15:09
Select District:
News Items:
Description:
18/11/2021: AP Weather Update: దూసుకొస్తున్న వాయుగుండం...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరంవైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం దక్షిణ కోస్తా ఆంధ్రా, ఉత్తర తమిళనాడు మధ్య చెన్నైకి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీణ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాలువలు, రిజర్వాయర్లు, చెరువుల వద్ద నిఘా ఉంచాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షానికి తిరుపతి నగరం పూర్తిగా జలమయమైంది. తిరుమలలో కొండల్లో భారీ వర్షాలకు సెలయేర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఘాట్ రోడ్లపైనా భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది.
Regional Description: