News Thursday, November 11, 2021 - 10:05
Submitted by andhra on Thu, 2021-11-11 10:05
Select District:
News Items:
Description:
భవిష్యత్తులో ఎవరూ వైద్యం కోసం మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడాదని సీఎం జగన్ అధికారులకు సూచన చేశారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా హెల్త్ క్లీనిక్ లు ఉండాలన్నారు..........
ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ హబ్స్ (heath Hub)ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశం మొత్తం గర్వించేలా.. మన రాష్ట్రంలో అత్యాధునిక వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. పూర్తి సదుపాయాలతో ఆస్పత్రులను నెలకొల్పాలని నిర్దేశించారు. మెడికల్ కళాశాలలు (Medical Colleges), సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానలను సరైన సమయంలో పూర్తి చేయాలన్నారు. వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. నాడు-నేడు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగు సహా ప్రాధాన్య కార్యక్రమాలపై చర్చించారు. ఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగా.. ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) నాడు-నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని.. డిసెంబర్ నాటికి మరమ్మతుల పనులు పూర్తవుతాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం జరుగుతోందని.. వచ్చే ఏడాది మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు. 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహాలు పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Regional Description: