News Saturday, March 4, 2017 - 09:54

Select District: 
News Items: 
Description: 
Don't have minimum balance in your SBI account? Get ready to pay fine from 1st April Making it compulsory for account-holders to maintain a minimum balance, the State Bank of India BSE -0.69 % (SBI) said on Thursday said it will be charging defaulters a penalty from April 1 onwards. Making maintenance of Rs 5,000 mandatory for accounts in metropolitan areas, Rs 3,000 in urban areas, Rs 2,000 in semi-urban areas and Rs 1,000 in rural areas, the SBI listed out the charges to be effective from April 1. These charges will be based on the difference between the minimum balance required and the shortfall. For metropolitan areas, if the shortfall is greater than 75 per cent. the charges would be Rs 100 plus service tax. If the shortfall is between 50-75 per cent, the bank would charge Rs 75 plus service tax and for below 50 per cent shortfall, a fee of Rs 50 plus service tax would be levied, according to the SBI notification of new charges. Similarly, for rural areas, the penalty for non-maintenance of minimum balance ranges from Rs 20-50 plus service tax, it said. These cash transaction charges at branches are already existing. The same have been renewed for the next financial year from April 1. It is to deter the customers from visiting the branch but the charges are very nominal. As it is, the customer does not need to visit the branch often because we provide 10 free withdrawals in a month from ATMs," a SBI official told IANS.
Regional Description: 
మీ ఎస్బీఐ ఖాతాలో కనీస నగదు నిల్వలు లేవా... ఖాతాల్లో కనీస మొత్తం నగదు నిల్వ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు జరిమానా విధించనుంది. ఈ సరికొత్త నిబంధన ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి. మహానగరాల్లోని శాఖల్లోని ఖాతాల్లో కనీస నగదు నిల్వ రూ.5,000, సాధారణ నగరాల్లో రూ.2,000, పట్టణాల్లో రూ.2,000 గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో రూ.1,000 ఉండాలని నిబంధనలను తీసుకొచ్చింది. ఖాతాల్లోని నగదు నిష్పత్తి నిల్వలకు అనుగుణంగా జరిమానా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖాతాల్లో కనీస నగదు నిల్వల్లో 50 నుంచి 75 శాతం కంటే తక్కువ ఉంటే రూ.75లతోపాటు అదనంగా సేవా పన్ను వసూలు చేస్తారు. అలాగే 50 శాతం కంటే తక్కువ ఉంటే రూ.50లతోపాటు సేవా అదనంగా వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస నిల్వలు లేని ఖాతాదారులకు రూ.20 నుంచి రూ.50 జరిమానాతోపాటు అదనంగా సేవా పన్ను ఉంటుందని తెలిపారు. నెలలో మూడు కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే రూ.50 ఛార్జ్‌ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. లావాదేవీలకు సంబంధించి సర్ ఛార్జ్‌ వసూలు ఇది వరకే అమలులో ఉంది. అయినా సరే దీనిని ఏప్రిల్‌ 1 నుంచి పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. దీని వల్ల ఖాతాదారులు ప్రతీసారి బ్యాంకులకు రాకుండా చేసేందుకు ఈ పద్ధతి ప్రవేశపెట్టామని, నామమాత్రపు రుసుం మాత్రమే వసూలు చేస్తున్నామని ఎస్బీఐ అధికారులు పేర్కొన్నారు. ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రాలు 10 సార్ల వరకు ఎలాంటి ఛార్జ్‌లు ఉండవని ఎస్బీఐకు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు.