News Wednesday, May 19, 2021 - 17:26
Submitted by andhra on Wed, 2021-05-19 17:26
Select District:
News Items:
Description:
మత్స్యకార కుటుంబాలకు రూ.30.21 కోట్లు
జిల్లాలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 30, 213 మత్స్యకార కుటుంబాలకు రూ. 30. 21 కోట్ల మేర లబ్ధిచేకూరినట్లు కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా 1, 19, 875 మత్స్యకార కుటుంబాలకు రూ. 119. 88 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 2021-22కు సంబంధించి జిల్లాలో పథకం అమలుతీరును కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. వేట నిషేధ సమయంలో (ఏప్రిల్ 15-జూన్ 14) అర్హత ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 10 వేలు చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమచేయడం జరుగుతుందని, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 30, 213 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతోందని తెలిపారు. వీరిలో 29, 920 మంది బీసీలు, 84 మంది ఓసీలు, 198 మంది ఎస్‌సీలు, 11 మంది ఎస్‌టీలు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో 8, 289 లబ్ధిదారులు ఉండగా, కాకినాడ అర్బన్ నియోజకవర్గం పరిధిలో 6, 486 మంది, పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 5, 749 మంది లబ్ధిదారులు ఉన్నట్లు వివరించారు. 2019, నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జీఎస్‌పీసీ ఇవ్వాల్సిన రూ. 78 కోట్లు పరిహారం మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారానే మత్స్యకారులకు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలోని తాళ్లరేవు మండలం, చిన బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన బర్రె లక్ష్మీనరసింహరాజు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంపై తన మనోగతాన్ని ముఖ్యమంత్రి ముందు వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సారాంశం ఆయన మాటల్లోనే పాదయాత్ర సందర్భంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి, సముద్రంలో మత్స్య సంతాన వృద్ధి నేపథ్యంలో అమలుచేస్తున్న వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ. 10 వేలు చొప్పున అందిస్తున్నందుకు మత్స్యకారులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం కరోనా క్లిష్ట సమయంలో అప్పు ఇచ్చేవారే కరవయ్యారని, ఇలాంటి పరిస్థితిలో నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో రూ. 10 వేలు చొప్పున జమచేస్తుండటంతో పండగ వాతావరణం నెలకొంది.
వేట సమయంలో ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో గతంలో ఆ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చేదని, ఇప్పుడు అలా కాకుండా చాలా తక్కువ సమయంలోనే రూ. 10 లక్షలు పరిహారం అందుతుండటంతో ఆయా కుటుంబాలకు పెద్ద ఆసరా లభిస్తోంది. డీజిల్ సబ్సిడీని కూడా రూ. 6. 03 నుంచి తొమ్మిది రూపాయలకు పెంచడం వల్ల బోటు యజమానులతో పాటు కలాసీలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆర్‌బీకేల్లో మత్స్య సహాయకులను నియమించడం వల్ల మత్స్యకార కుటుంబాలు గ్రామాల్లోనే వివిధ సేవలు పొందేందుకు వీలవుతోంది. పథకాలకు లబ్ధిదారుల ఎంపిక వేగవంతంగా జరుగుతోంది. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌తో పాటు చిన్నతరహా రేవులు అందుబాటులోకి వస్తే జిల్లాలోని మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. మత్స్యకార కుటుంబాలకు మంచి ఉపాధి లభిస్తుంది. సాగరమిత్రల వ్యవస్థ ద్వారా కూడా సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఎంతో మేలు జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలకు చెందిన విద్యార్థులు మంచి చదువులు చదివేందుకు అవకాశం ఏర్పడుతోంది.
మత్స్యకారులకు నిజమైన భరోసా: మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
మత్స్య సంపద వృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమలవుతున్న వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని అమలుచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పేదవాని ఇంటికే నేడు పాలన వెళ్తోందని, ప్రతి లబ్ధిదారుని ఖాతాలో నేరుగా రూ. 10 వేలు జమవుతోందన్నారు. రూ. 6. 03 ఉన్న డీజిల్ రాయితీని రూ. 9కు పెంచినట్లు తెలిపారు. మత్స్యకార కుటుంబాల పిల్లలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు.
వేట నిషేధ సమయంలో మత్స్యకారులు వలలు, బోటులను బాగుచేసుకోవడం వంటివి చేస్తారని, ఈ సమయంలో వారికి ఆర్థికంగా బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలుచేస్తున్నట్లు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ పి. కోటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, జిల్లాలోని వివిధ ప్రాంతాల మత్స్యకారులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Regional Description: