News Sunday, February 7, 2021 - 18:28

News Items: 
Description: 
పదవ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ప్రధానాంశాలు: • 3446 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల • ఆంధ్రప్రదేశ్‌లో 2296, తెలంగాణలో 1150 ఖాళీలు • ఫిబ్రవరి 26 దరఖాస్తులకు చివరితేది తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 3446 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవ‌లం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. అర్హత ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారత తపాలా విభాగం బ్రాంచ్ పోస్టుమాస్ట‌ర్‌ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్ట‌ర్‌ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2296, తెలంగాణలో 1150 పోస్టులున్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ సబ్జెక్టుల‌తో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్‌లో చదివి ఉండాలి. కనీసం 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికెట్ పొందాలి. కంప్యూటర్ కోర్సును ఒక సబ్జెక్టుగా పదో తరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి. • వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు: • ఎస్‌ఎస్‌సీ (పదో తరగతి) సర్టిఫికెట్ లేదా మార్కుల మెమో సమర్పించాలి. వాటిలో మార్కులు, పాయింట్స్, గ్రేడ్స్ లేకపోతే ఎస్ఎస్‌సీ మార్కులషీట్ లేదా అడిషనల్ మార్కులమెమో జత చేయాలి. ఈ మెమోలో పుట్టిన తేదీ లేకపోతే సంబంధిత ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్, కమ్యూనిటీ ధ్రువ‌ప‌త్రాలు, ఫొటో, సంతకం, దివ్యాంగులు సందరం, ట్రాన్‌్పజెండ‌ర్లు సంబంధిత‌ సర్టిఫికెట్లు జత చేయాలి. ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలకు అదనపు వెయిటేజ్ ఏమీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్(టీఆర్‌సీఏ) పద్ధతి కింద ఆయా పోస్టులకు ఎంపికైన వారికి చెల్లింపులు ఉంటాయి. బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం)కు కనీసం 4 గంటలకు టీఆర్‌సీఏ రూ.12000, 5 గంటలకు టీఆర్‌సీఏ రూ.14500 ఇస్తారు. ఏబీపీఎం/ డాక్ సేవక్లకు కనీసం 4 గంటలకు టీఆర్‌సీఏ రూ. 10000, 5 గంటలకు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు. • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 27, 2021న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 దరఖాస్తులకు చివరితేది. • దరఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ట్రాన్స్‌మెన్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. • వెబ్‌సైట్‌:https://appost.in/
Regional Description: 