News Thursday, October 8, 2020 - 15:12
Submitted by andhra on Thu, 2020-10-08 15:12
Select District:
News Items:
Description:
ఏపీ ప్రజలకు అలర్ట్: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ సూచనలు
ఏపీలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండీ సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని.. వచ్చే 24గంటల్లో అది వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలుల వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Regional Description: