News Sunday, August 2, 2020 - 13:53
Submitted by andhra on Sun, 2020-08-02 13:53
Select District:
News Items:
Description:
104 vehicles as corona saviors in AP : 104కు కాల్ చేస్తే చాలు..కరోనా టెస్టింగ్ నుంచి చికిత్స వరకూ సహాయం.
ఏపీ ప్రభుత్వం 104కు ఫోన్ కాల్ ద్వారాకోవిడ్ పరిష్కారం చూపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెంబరుకు ఫోన్ చేస్తే కరోనాకు సంబంధించి టెస్టింగ్ దగ్గర నుంచి, చికిత్స అందించే వరకు సదుపాయాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తుంది. దీని ఆధారంగా రోగులు చికిత్స పొంది కరోనా నుంచి విముక్తి పొందవచ్చు. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి? ఎవరిని సంప్రదించాలి ? పాజిటివ్ అయితే ఏఆసుపత్రికి వెళ్ళాలి ? ఇలా బాధితులకు ఎన్నో సందేహాలు. వీటన్నిటికీ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన 104 కాల్ సెంటర్ ఫోన్ చేసిన వెంటనే పరిష్కారం చూపుతుంది. 5 నిమిషాలలోనే ఆసుపత్రుల సమాచారం అందిస్తుంది. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లాకొకటి చొప్పున పనిచేస్తున్న ఈ కాల్ సెంటర్లను 24గంటలూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, అందులో ఉన్న పడకలతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లు, వాటిలో ఎన్ని పడకలు ఉన్నాయి అనే సమాచారం చెపుతారు.
దీర్ఘకాలిక జబ్బులతో ఉన్నవారికైతే స్టేట్ కోవిడ్ ఆసుపత్రుల సమాచారం, పడవకల వివరాలు వెంటనే ఇస్తారు. కరోనా టెస్టింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి ఎన్ని గంటలకు వెళ్ళాలి వంటి సమాచారం తెలియచేస్తారు. కోవిడ్ సేవలు అందించే ప్రైవేటు ఆసుపత్రులు, వాటిలో పడకల సమాచారం కూడా ఇస్తారు.
104 కు కాల్ చేస్తే సమాచారమిలా..
• ముందు 104కు కాల్ చేయాలి. అనంతరం మీకు ఎటువంటి సేవలు కావాలో అడుగుతారు
• 1 నొక్కితే సాధారణ సమస్యలపై స్పందిస్తారు.
• 2నొక్కితే కరోనా సమస్యలపై స్పందిస్తారు
• ఫోన్ చేసిన బాధితుడి నుంచి కాల్ సెంటర్ ప్రతినిధి పూర్తి వివరాలు, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారు.
• ఆయాసం లేదా ఇతర కరోనా సమస్యలతో పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే జిల్లా అధికార యంత్రాంగాన్ని పురమాయిస్తారు.
• ఎమర్జెన్సీ అయితే 30 నిమిషాల్లోపే ఆ వ్యక్తి వద్దకు అంబులెన్స్ ను పంపించి ఆసుపత్రికి చేరుస్తారు.
• అప్పటికే ఆసుపత్రి వైద్యులకు సంబంధిత వ్యక్తి సమాచారం పంపుతారు.
Regional Description: