News Tuesday, May 26, 2020 - 11:13
Submitted by andhra on Tue, 2020-05-26 11:13
Select District:
News Items:
Description:
వేటనిషేధ కాలం తగ్గింపు ***
సముద్రంలో చేపలవేట నిషేధ కాలాన్ని 15 రోజులకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిషేధం ఉంటుంది. ఈ ఏడాది కరోనా నియంత్రణకై మార్చి 22న లాక్ డౌన్ విధించడంతో అప్పటినుండి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మత్స్యకారులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న రీత్యా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాన్ని సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. దీనికి స్పందించిన కేంద్రప్రభుత్వం జూన్ 1 నుంచి సముద్రంలో చేపలవేటకు అనుమతి ఇస్తూ మే 25 వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా మత్స్యకారులు జూన్ 1 నుంచి చేపలవేటకు వెళ్ళుటకు సిద్దమవ్వాలని సూచించారు.
Regional Description: