ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో మే 13వ తేదీ అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి 15 వ తేదీకి వాయుగుండంగా మారనుంది. తదుపరి మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 16వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది మే 17వ తేదీవరకు వాయువ్య దిశగా కదులుతూ తదుపరి ఈశాన్యదిశగా వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 17వ తేదీ నుంచి ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.