News Wednesday, January 25, 2017 - 10:01

News Items: 
Description: 
Aroya Raksha Health Insurance అందరికీ ఆరోగ్య రక్ష: వైద్యం ఈ రోజులలో ఎంతో విలువైనది, ముఖ్యమైనది. పాల నుంచి ఆహారం వరకు అన్ని వస్తువులలో కల్తీ, కలుషిత వాతావరణం నేపధ్యంలో ప్రాణాంతక వ్యాధులు ప్రజలను కకావికలం చేస్తున్నాయి. జ్వరం వస్తే రోగితో పాటు కుటుంబం అంతా వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకు వైద్య ఖర్చులే కారణం. తెలుపు రేషన్ కార్డు లేదా మరే ఇతర సదుపాయం లేని వారికి ప్రభుత్వం ఆరోగ్య రక్ష అనే పధకాన్ని చేపట్టింది. ఈ పధకంలో చేరడానికి వయసు అపుడే పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు చేరవచ్చు. ప్రతీ ఒకరికి నెలకు రూ. 100 చొప్పున సంవత్సరానికి 1200 రూపాయలు చెల్లించాలి. దీనికి 2 లక్షల వరకు ఆరోగ్యభీమా వర్తిస్తుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వున్న 410 నెట్ వర్కు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవచ్చు. ఈ పధకం లో చేరడానికి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు ఉంది. ఈ పధకంలో వైద్యంతో పాటు మందులు, ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. దీనికొరకు మీకు దగ్గరలో గల మీ సేవా కేంద్రంలో ప్రీమియం చెల్లించి ఆరోగ్యరక్ష కార్డు పొందగలరు.
Regional Description: 
అందరికీ ఆరోగ్య రక్ష: వైద్యం ఈ రోజులలో ఎంతో విలువైనది, ముఖ్యమైనది. పాల నుంచి ఆహారం వరకు అన్ని వస్తువులలో కల్తీ, కలుషిత వాతావరణం నేపధ్యంలో ప్రాణాంతక వ్యాధులు ప్రజలను కకావికలం చేస్తున్నాయి. జ్వరం వస్తే రోగితో పాటు కుటుంబం అంతా వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకు వైద్య ఖర్చులే కారణం. తెలుపు రేషన్ కార్డు లేదా మరే ఇతర సదుపాయం లేని వారికి ప్రభుత్వం ఆరోగ్య రక్ష అనే పధకాన్ని చేపట్టింది. ఈ పధకంలో చేరడానికి వయసు అపుడే పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు చేరవచ్చు. ప్రతీ ఒకరికి నెలకు రూ. 100 చొప్పున సంవత్సరానికి 1200 రూపాయలు చెల్లించాలి. దీనికి 2 లక్షల వరకు ఆరోగ్యభీమా వర్తిస్తుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వున్న 410 నెట్ వర్కు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవచ్చు. ఈ పధకం లో చేరడానికి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు ఉంది. ఈ పధకంలో వైద్యంతో పాటు మందులు, ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. దీనికొరకు మీకు దగ్గరలో గల మీ సేవా కేంద్రంలో ప్రీమియం చెల్లించి ఆరోగ్యరక్ష కార్డు పొందగలరు.