News Wednesday, January 18, 2017 - 10:22

Select District: 
News Items: 
Description: 
BSNL – SBI Mobi Cash Wallet: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా BSNL-SBI మోబీక్యాష్ ఎంవాలెట్ ఆంధ్రప్రదేశ్ లోకి అందుబాటులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎం వాలెట్ ను BSNL సిజియం ప్రారంభించారు. సాధారణంగా వాలెట్ లోకి నగదును బదిలీ చేయాలంటే డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఖాతాలలో ఏదైనా ఒకటి ఉండడం తప్పనిసరి. కానీ BSNL-SBI మోబీక్యాష్ ఎంవాలెట్ కు ఇవేవీ అక్కర్లేదు. మీ దగ్గరలోని BSNL రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే వీరి నుంచి నగదును తీసుకోవచ్చు. ఏదైనా బ్యాంకుకు కూడా బదిలీ చేసుకోవచ్చు. సాధారణ ఫీచర్ ఫోన్లో సౌతం వాలెట్ పనిచేయడం విశేషం. SBI ఖాతాకు IFSC కోడ్ లేకుండానే ఖాతాదారులు నగదును బదిలీ చేయవచ్చు. మోబైల్ యాప్ నెట్ ద్వారా, SMS, USSD ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీనిద్వారా మొదటి దశలో నగదు బదిలీ, BSNL ఫోన్ బిల్లుల చెల్లింపు మరియు వాలెట్ నుంచి వాలెట్ కు, బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
Regional Description: 
BSNL మరియు SBI మోబీక్యాష్ వాలెట్ : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా BSNL-SBI మోబీక్యాష్ ఎంవాలెట్ ఆంధ్రప్రదేశ్ లోకి అందుబాటులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎం వాలెట్ ను BSNL సిజియం ప్రారంభించారు. సాధారణంగా వాలెట్ లోకి నగదును బదిలీ చేయాలంటే డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఖాతాలలో ఏదైనా ఒకటి ఉండడం తప్పనిసరి. కానీ BSNL-SBI మోబీక్యాష్ ఎంవాలెట్ కు ఇవేవీ అక్కర్లేదు. మీ దగ్గరలోని BSNL రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే వీరి నుంచి నగదును తీసుకోవచ్చు. ఏదైనా బ్యాంకుకు కూడా బదిలీ చేసుకోవచ్చు. సాధారణ ఫీచర్ ఫోన్లో సౌతం వాలెట్ పనిచేయడం విశేషం. SBI ఖాతాకు IFSC కోడ్ లేకుండానే ఖాతాదారులు నగదును బదిలీ చేయవచ్చు. మోబైల్ యాప్ నెట్ ద్వారా, SMS, USSD ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీనిద్వారా మొదటి దశలో నగదు బదిలీ, BSNL ఫోన్ బిల్లుల చెల్లింపు మరియు వాలెట్ నుంచి వాలెట్ కు, బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.