News Tuesday, July 30, 2019 - 14:21

Select District: 
News Items: 
Description: 
ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగాలకు మొత్తం 13 కేటగిరిల్లో నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఏపీ వ్యాప్తంగా వేలాది ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన ఈ పోస్టులకు ఈ నెల 29 నుంచి ఆగస్టు 12 వరకు గడువు ఉంది. నెలకు రూ.14,600 నుంచి రూ.44,870 వరకు జీతంతో పాటు ఇతర ఆలవెన్సులు ఉంటాయి. మొదటి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌లో రూ.15 వేలు చెల్లిస్తారు. పనితీరు బాగుంటే కొనసాగిస్తారు. ప్రతి ఉద్యోగానికి వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంది. ఎస్సీలకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు పరీక్ష ఫీజు రూ.200 మినహాయింపు ఇవ్వగా ప్రాసెసింగ్‌ ఫీజు 200 చెల్లించాల్సి ఉంది. ఈ ఉగ్యోగాలకు సెప్టెంబరు 1 నుంచి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిచనున్నారు. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందుగానే హాల్‌టికెట్లు పంపుతారు. ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు. - ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ - 2 పోస్టులకు వేతనం రూ.14,600 నుంచి రూ. 44,870 వరకు ఉంటుంది. సెప్టెంబరు 1న పరీక్ష నిర్వహిస్తారు. సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివినవారు అర్హులు. - విలేజ్‌ అగ్రికల్చర్‌ పోస్టుల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీఈవోలుగా ఆత్మ ప్రాజెక్టులో పని చేయాల్సి ఉంటుంది. - పంచాయతీ సెక్ర టరీ గ్రేడ్‌ -6 డిజిటల్‌ అసిస్టెంట్లు (కంప్యూటర్‌ ఆపరేటర్లు) పోస్టులకు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్‌, బీసీఏ, ఎంసీఏ, ఐటీ ఇన్‌స్ట్రుమెంట్‌, డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. - విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్లు పరీక్ష రాసేవారు బీఎస్సీ హార్టీకల్చర్‌ లేదా బీఎస్సీ ఆనర్స్‌ డిప్లొమా అర్హత ఉండాలి. - విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్ -3 పోస్టులకు నెలకు జీతం రూ.15 వేలు. డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు సర్వేలో చేసిన వారు అర్హులు, పాలిటెక్నిక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, బీఈ, బీటెక్‌ చదివిన వారు, లైసెన్స్‌డ్‌ సర్వే సర్టిఫికెట్లు ఉన్న వారు అర్హులే. - యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ పోస్టులకు రెండు సంవత్సరాల యానిమల్‌ హజ్బెండరీ పాలిటెక్నిక్‌, ఇంటర్‌ ఓకేషనల్‌ కోర్సు డెయిరీయింగ్‌, పౌల్ట్రీ కోర్సులు చేసిన వారు అర్హులు. - విలేజ్‌ రెవెన్యూ అధికారి గ్రేడ్ -2కు 10వ తరగతి లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్‌ కోర్సు చదివి ఉండాలి. - పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌ -5 పోస్టులకు గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలి. - వెల్పేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన ఏదైన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి
Regional Description: 