బంగాళాఖాతంలో ఉన్న ఫణి అతి తీవ్రమైన తుఫాను ప్రస్తుతం ఇది విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 150 కి.మీ దూరంలోను మరియు పూరీకి 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈరోజు తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఒడిషాలో మే 3వ తారీఖున గోపలపూర్ లేదా పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు తీరం దాటే ప్రాంతంలో గంటకు 175 నుంచి 200 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. మే 2వ తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో తీరప్రాంతాలలో ఉధృతమయిన గాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి మే 4వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము