హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఫణి తుఫాను ప్రస్తుతం చెన్నైకు 1040 కి.మీ దూరంలోను, మచిలీపట్నంకు 1200 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 12 గంటలలో తీవ్రమైన తుఫానుగా మారనుంది. ఇది మే 1 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తదుపరి తూర్పు ఈశాన్య దిశగా తిరిగే అవకాశ ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీర ప్రాంతాలలో 30 వ తేదీ సాయంత్రం నుంచి గాలివేగం 45 నుంచి 55 కి.మీ వరకు వీయవచ్చు మరియు సముద్రంలో అలల ఎత్తు 12 నుంచి 16 అడుగుల వరకు ఎగిసిపడతాయి. మే 1వ తేదీ నుంచి కొన్ని తీరప్రాంతాలలో మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము