హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఫణి తుఫాను ప్రస్తుతం చెన్నైకు 1100 కి.మీ దూరంలోను, మచిలీపట్నంకు 1300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 12 గంటలలో తీవ్రమైన తుఫానుగా మారనుంది. ఈ నెల 30న లేదా మే 1 వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇది తీరం దాటే సమయంలో తీరం దాటే ప్రాంతంలో గంటకు 130 నుంచి 140 కి.మీ వరకు వీయవచ్చు. తుపాను ప్రభావం ఈ నెల 29వ తేదీ నుంచి స్వల్పంగా మొదలై క్రమంగా పెరగనుంది. 29వ తేదీ లేదా 30వ తేదీ నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.