You are here
Disaster Alerts 26/04/2019
State:
Andhra Pradesh
Message:
హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం నేడు దక్షిణ బంగాళా ఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం శనివారం నాటికి తుపానుగా మారనుంది. తుపానుగా మారిన తర్వాత 72 గంటలు శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావం ఈ నెల 28వ తేదీ నుంచి స్వల్పంగా మొదలై క్రమంగా పెరగనుంది. 28వ తేదీ నుంచి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో ఈదురు గాలులు ప్రారంభమై ఉధృతమవుతాయి. 29వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 29వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. భారీ ఈదురుగాలులూ వీస్తాయి. అదే సమయంలో అక్కడక్కడా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 30వ తేదీన తుపాను తీరం దాటే నాటికి గాలి తీవ్రత మరింత పెరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. .
Disaster Type:
State id:
1
Disaster Id:
2
Message discription: