News Tuesday, December 18, 2018 - 21:13

Select District: 
News Items: 
Description: 
పెథాయ్ తుపాను బాధితుల కోసం RTGS యాప్‌ : పెథాయ్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తుఫాన్‌ ధాటికి ఆస్తినష్టం, పంట నష్టం వాటిల్లే సూచనలుండటంతో భాదితులకు తక్షణం పరిహారం అందేలా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఆర్టీజీఎస్ కృషి చేస్తుంది. ఇందుకోసం పీపుల్ ఫస్ట్ యాప్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. తుఫాను బాధితులకు తక్షణమే సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుంటుంది. ఆర్టీజీఎస్ యాప్‌లో తుపాన్ ద్వారా జరిగిన నష్టాన్ని సెల్‌ ఫోన్ ద్వారా ఫోటో తీసి ఈ యాప్‌లో పొందుపరిస్తే చాలు. ఈఫోటోలను ఆర్టీజీఎస్‌ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సంబంధిత విభాగాలకు చేరవేస్తుంది. అక్కడ క్షేత్రస్థాయి ప్రభుత్వ అధికారులు నష్టాన్ని మదింపు చేసి..వెంటనే పరిహారాన్ని చెల్లిస్తారు. వారి ఖాతాల్లోకే డబ్బును జమ చేస్తారు. దీనికంతా బాధితులు చేయాల్సిందల్లా పీపుల్ ఫస్ట్ యాప్‌ను డౌన్ లోక్ చేసుకోవడమే. *గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి పీపుల్ ఫస్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. *యాప్‌లో మీ ఆధార్ నంబర్, గ్రామం, మండలం, జిల్లా వివరాలు నమోదు చేసుకోవాలి *మీ ఫిర్యాదును నమోదు చేయాలి *మీ పొలం సర్వే నెంబరు, పంట, జరిగిన నష్టం వివరాలు నమోదు చేయాలి * పీపుల్ ఫస్ట్ యాప్‌ను https://rtg.ap.gov.in లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ క్రౌడ్ సోర్సింగ్ యాప్‌లో పంటనష్టం, కూలిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్లు తదితర 11అంశాలను విభజించింది. ఎవరైనా సరే అందులోకి వెళ్లి అక్కడ క్లిక్ చేయగానే ఆ ప్రాంత ప్రజలు పంపిన చిత్రాలు, జరిగిన నష్టం తాలూకు వివరాలు స్పష్టంగా తెరమీద కనిపించేలా ఏర్పాట్లు చేశారు. పీపుల్ ఫస్ట్ యాప్‌ కు బాధితులు పంపిన చిత్రాలను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణం సంబంధిత విభాగాల మదింపు బృందాలకు వెళ్లేలా చేశారు. ఈ చిత్రాల ద్వారా నష్టం మదింపు బృందాలు సకాలంలో వాటిని మదింపు వేస్తారు. తిత్లీ తుఫాన్ బాధితులు కూడా జరిగిన నష్టాన్ని ఫోటోలు తీసి ఈ యాప్‌లో పొందుపరచాలని ఆర్టీజీఎస్‌ విజ్ఞప్తి చేసింది. అందులో ఆ నష్టం జరిగిన బాధితుడి పూర్తి వివరాలు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు పొందుపరచడంతో పాటు జీపీఎస్‌ వివరాలు కూడా స్పష్టంగా పేర్కొంటే సత్వరం పరిహారం పొందే వీలుటుంది. ఈయాప్‌ డౌన్‌లోడు చేసుకోవడం, తుఫాన్ నష్టం చిత్రాలను పంపడంలో ఎలాంటి సమస్యలు తెలెత్తినా..అనుమానాలున్నా నివృత్తి చేసుకునేందుకు 1100 కాల్‌ సెంటర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని తక్షణం సిబ్బంది పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది.
Regional Description: 