దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం 15వ తేదీ సాయంత్రం ఫితై తుఫానుగా మారింది. ఇది తదుపరి మరో 24 గంటలలో ఇది తీవ్రమైన తుఫానుగా మారుతుంది. ఇది ప్రస్తుతం 16వ తేదీ ఉదయం 12.00 గంటల సమయానికి మచిలీపట్నంకు ఆగ్నేయ దిశగా 690 కి.మీ దూరంలో ఉంది. ఇది 17వ తేదీ మధ్యాహ్నం కాకినాడ మరియు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో దుర్గరాజుపట్నం నుంచి బారువా తీరం వరకు, డిసెంబర్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 18 అడుగుల వరకు ఎగిసిపడి సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. గాలివేగం 50 నుంచి 60 కిలోమీటర్లు మరియు తీరానికి చేరువయ్యే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి మీ యొక్క వేటసామాగ్రి అయిన బోట్లు మరియు వలలను సురక్షిత ప్రాంతాలలోకి తరలించుకోవాలి. అలాగే డిసెంబు 16 మరియు 17 వ తేదీలలో మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 18వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము.