బంగాళాఖాతంలో వున్న టిట్లి తుఫాను తీవ్రమైన పెను తుఫానుగా మారనుంది. ఇది ప్రస్తుతం కళింగపట్నంకు 150 కి.మీ దూరంలో ఉంది. ఇది 11వ తేదీ ఉదయం కళింగపట్నం మరియు గోపాలపూర్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా కాకినాడ నుండి బారువా తీరం వరకు గల సముద్ర ప్రాంతాలలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు మరియు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 14 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. తీరం దాటే ప్రదేశం వద్ద ఆ సమయంలో గంటకు 130 నుంచి 140 కి.మీ వరకు గాలులు వీయవచ్చు కావున మత్స్యకారులు ముఖ్యంగా విశాఖపట్నం, విజయననగరం, శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.