News Friday, May 18, 2018 - 17:51

News Items: 
Description: 
Rs. 1,000 Pension for Fishermen పేద మత్స్యకారులకు NTR భరోసా పధకం కింద 33,722 ఫించన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 65 సంవత్సరాలు పైబడిన మత్స్యకారులకు ఈ పధకం కింద ఉండగా ప్రస్తుతం 50 సంవత్సరాలనుంచి ఫించన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే చేనేత, కల్లుగీత కార్మికులకు 50 సంవత్సరాలనుంచి ఇప్తున్న ప్రభుత్వం, మత్స్యకారులకు సైతం వయసు సడలింపు ఇచ్చింది. అర్హులైన మత్స్యకారులు ఒకొక్కరికి నెలకు రూ. 1,000 చొప్పున ఇవ్వనుంది. తూర్పుగోదావరి జిల్లాలో 7,541 మంది, శ్రీకాకుళంలో 6,126 మంది, విశాఖపట్నంలో 4,827 మంది, కృష్ణా 3,958, నెల్లూరు 3,126, ప్రకాశం 2,612, పశ్చిమగోదావరి 2,066, గుంటూరు 1,659, విజయనగరం 1,207మంది లభ్ధదారులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫించన్ల ఎంపికలో సముద్రప్రాంత మత్స్యకారులకు ప్రాధాన్యము ఇవ్వాలని మరియు ఈ ఫించన్లను జూన్ నెలనుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
Regional Description: 
మత్స్యకారులకు రూ. 1000 ఫించను పేద మత్స్యకారులకు NTR భరోసా పధకం కింద 33,722 ఫించన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 65 సంవత్సరాలు పైబడిన మత్స్యకారులకు ఈ పధకం కింద ఉండగా ప్రస్తుతం 50 సంవత్సరాలనుంచి ఫించన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే చేనేత, కల్లుగీత కార్మికులకు 50 సంవత్సరాలనుంచి ఇప్తున్న ప్రభుత్వం, మత్స్యకారులకు సైతం వయసు సడలింపు ఇచ్చింది. అర్హులైన మత్స్యకారులు ఒకొక్కరికి నెలకు రూ. 1,000 చొప్పున ఇవ్వనుంది. తూర్పుగోదావరి జిల్లాలో 7,541 మంది, శ్రీకాకుళంలో 6,126 మంది, విశాఖపట్నంలో 4,827 మంది, కృష్ణా 3,958, నెల్లూరు 3,126, ప్రకాశం 2,612, పశ్చిమగోదావరి 2,066, గుంటూరు 1,659, విజయనగరం 1,207మంది లభ్ధదారులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫించన్ల ఎంపికలో సముద్రప్రాంత మత్స్యకారులకు ప్రాధాన్యము ఇవ్వాలని మరియు ఈ ఫించన్లను జూన్ నెలనుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.